30-03-2025 11:55:32 PM
గువాహటి: ఐపీఎల్-2025 లో భాగంగా గువాహటి వేదికగా జరిగినా మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 6 పరుగుల తేడాతో విజయం సోంతం చేసుకుంది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చినా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో 176 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (63), రాహుల్ త్రిపతి (23), రవీంద్ర జడేజ(32) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. తోలుత బ్యాటింగ్ చేసినా రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో నితీశ్ రాణా (81), రియాన్ పరాగ్ (37), సంజు శాంసన్ (20) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీశ పతిరాణ తలో 2 వికెట్లు తీసారు.