ముంబై గెలుపు బాట పట్టేనా?
గుజరాత్‌తో కీలక పోరు
సూపర్ ఫామ్‌లో గిల్, బట్లర్
అహ్మదాబాద్, ఏప్రిల్ 19: ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ సిద్ధమైంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ముంబై ఈ సారి కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరు సగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్రస్తుతం పా యింట్ల పట్టికలో కేవలం 2 పాయింట్లతో అట్టడుగు స్థా నంలో నిలిచింది.
ప్లే ఆఫ్ అవకాశాలు నిలవాలంటే ఇక్క డ నుంచి జరిగే మ్యాచ్‌లలో విజయాలు సాధించాల్సిందే. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం ముంబైకి ఎదురుదెబ్బగా చెప్పాలి. గత మ్యాచ్‌లో డికాక్ సెంచరీ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, రికల్టన్ పేలవ ఫామ్ లో ఉన్నారు. తిలక్ వర్మ సైతం నిరాశపరుస్తున్నాడు. హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ మ్యాచ్‌లను ఫినిష్ చేయలేకపోతున్నారు. బ్యాట ర్లు సమిష్టిగా రాణిస్తేనే ముంబై గెలుపు బాట పట్టే అవకాశముంటుంది.
అటు బౌలింగ్ లోనూ ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ పేసర్ బుమ్రా వికెట్లు తీయలేకపోతుండడం ఆ జట్టుకు మైనస్ పాయింట్. ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా ఇప్పుడు ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో ముంబై త్వరగా ఫామ్ అందుకోవాలని ముంబై ఎదురుచూస్తోంది. మిగిలిన బౌ లర్లలో శార్థూల్ ఠాకూర్, హార్థిక్ పాండ్య, శాంట్నర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది.
మొదట వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన గుజ రాత్ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఢిల్లీ, లక్నో, కోల్‌కతా జట్లపై గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. శుభమన్ గిల్, సాయి సుదర్శన్‌తో పాటు బట్లర్ ఫామ్‌లో ఉండగా... వాషింగ్టన్ సుందర్ కూ డా మెరుపులు మెరిపిస్తున్నాడు. అటు బౌలింగ్‌లో రబాడ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ సత్తా చాటుతున్నారు. స్పి న్నర్ రషీద్ ఖాన్ కూడా కీలకంగా ఉన్నాడు. గత రికార్డుల్లో ముంబైపై గుజరాత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 8 సార్లు తలపడితే గుజరాత్ ఐదింటిలో గెలిచింది. మూడు మ్యాచ్ లలో ముంబై విజయం సాధించింది.






