కోల్ ఖాతా తెరిచిందోచ్
రింకూ అద్భుత పోరాటం
రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
హమ్మయ్య ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్‌పై రింకూ సింగ్ అద్భుత పోరాటంతో తొలి విజయాన్ని అందుకుంది. లక్ష్యం భారీగా లేకున్నా మరోసారి కోల్‌కతా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఉత్కం ఠగా మారింది. చివరికి రింకూ, అంకుల్ రాయ్ పోరాటంతో ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. చాలా రోజుల తర్వాత రింకూ సింగ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం కేకేఆర్‌కు ఊరటనిచ్చింది
కోల్‌కతా, ఏప్రిల్ 19: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. కానీ వైభవ్ 28 బంతుల్లో 46 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కాసేపటికే జురెల్ (5), జైస్వాల్ (39) పరుగులకు ఔటయ్యారు.
ఇక్కడ నుంచీ రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది. స్పిన్ పిచ్ కావడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛేజింగ్ అంత సా ఫీగా సాగలేదు. తొలి బంతికే సిఫర్ట్ డకౌవగా.. పవర్ ప్లే లోనే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. రఘువంశీ (10), పావెల్ (23), రమణ్ దీప్ సిం గ్ (10) కూడా ఔటవడంతో కోల్ కతా మ్యాచ్ గెలవడం కష్టంగానే కనిపించింది. ఫామ్ లో లేని రింకూసింగ్, టె యిలెండర్ అంకుల్ రాయ్ అద్భుతంగా చేశారు.
వీరోచిత పోరాటంతో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశారు. వీరి ద్దరూ 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వా మ్యం నెలకొల్పారు. నిజానికి రింకూ సింగ్ ఇచ్చిన క్యా చ్‌ను ఫెరీరా జారవిడవడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పొ చ్చు. చాలారోజుల తర్వాత రిం కూ సింగ్ తనదైన బ్యాటింగ్‌తో అలరించాడు. రింకూ సింగ్ 34 బంతుల్లో 53 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్, అంకుల్ రాయ్ 16 బంతుల్లో 29 (1 ఫోర్ , 2 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచారు. దీంతో సీజన్ తొలి విజయాన్ని అందుకున్న కోల్ కతా పాయిం ట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది.
స్కోరు బోర్డు
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 155/9 ( వైభవ్ 46, జైస్వాల్ 39, హెట్‌మెయిర్ 15 ; వరుణ్ చక్రవర్తి 3/14, కార్తీక్ త్యాగి 3/22, నరైన్ 2/26)
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 161/6 ( రింకూ సింగ్ 53, అంకుల్ రాయ్ 29, గ్రీన్ 27 ; జడేజా 2/8, బర్గర్ 1/20, ఆర్చర్ 1/35)






