20 April, 2026 | 2:43 AM

తప్పుడు ఆరోపణలను ఖండించిన హెచ్‌సీఏ

20-04-2026 12:47 AM

తెలంగాణ టీ20 లీగ్‌పై గందరగోళం సృష్టించొద్దు 

లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్, ఏప్రిల్ 17: గత కొంత కాలంగా తమపై  జరుగుతున్న తప్పుడు ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖండించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణ టీ20 లీగ్ విషయంలో తప్పుదోవ పట్టించేవిధంగా ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ లీగ్‌పై గం దరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పు డు ప్రచారంగా అభిప్రాయపడింది.

1934 నుంచి బీసీసీఐ గుర్తింపు పొందిన హెచ్‌సీఏ వ్యవహారాల్లో వేరొకరి జోక్యం చేసుకునేందుకు ఎవ్వరికీ అధికారం లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు సమర్థించిన ఒక రాష్ట్రం సభ్యుడు సూత్రం ప్రకారమే హెచ్‌సీఏ తెలంగాణలో క్రికెట్ నిర్వహణను చూసుకుంటోందని తెలిపింది. రాష్ట్ర క్రికెట్‌కు సంబంధించి పరిపాలనా విషయాలను నిర్వహించేందుకు హెచ్‌సీఏకు మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు లేదా మరే ఇతర కోర్టు కూడా తమ పనితీరుపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది.

తెలంగాణ టీ20 లీగ్ ద్వారా అట్టడుగు స్థాయి క్రికెట్‌ను బలోపేతం చేయడం, తెలంగా ణ అంత టా ఆటగాళ్లకు అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ట్టు తెలిపింది. బీసీసీఐ రూ పొందిం చిన నిర్థిష్టమైన నిబంధనలకు అను గుణంగా నే ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్టు హెచ్‌సీఏ స్పష్టం చేసింది. పారదర్శక పాలనతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆట యొక్క సమగ్రతను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.