భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
27-06-2026 02:20 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 26: జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కులమతాలకు అతీతంగా హిందూ,ముస్లింలు శుక్రవారం మొహర్రం వేడు కలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపు కున్నారు.గ్రామాల్లోని పీర్ల సావిడి దగ్గర కొలువుదీరిన పీర్లను సందర్శించిన భక్తులకు బెల్లంతో తయారుచేసిన పానకాన్ని, ప్రసా దాలను పంచిపెట్టారు.
చాదార్లను ముజవా ర్లకు సమర్పించి పీర్లకు అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు.ఆయా ప్రాంతా ల్లోని వివిధ పేర్లతో పిలువబడే పీర్లను వీధుల్లో ఊరేగించారు.అలాగే పీర్ల సావడి ముందు అలాంలో అగ్నిగుండం రాజేసి దాని ముందు అలాం ఆడుతూ ఉత్సా హంగా గడిపారు.హిందూ,ముస్లిం యువకు లు, పెద్దలు ఉపవాస దీక్ష చేశారు.అనంతరం పీర్లను గ్రామ సమీపంలోని బావుల్లో నిమజ్జనం చేశారు.






