30 March, 2026 | 3:58 PM

కేంద్రం కీలక నిర్ణయం... సహజీవన జంటలకు కుటుంబ హోదా

30-03-2026 02:19 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన- 2047(India Census) ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా ఇళ్ల గణన చేపట్టనున్నారు. జనగణన ప్రక్రియ నిబంధనల్లో కేంద్రం ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు కేంద్రం కుటుంబ హోదా ఇవ్వనుంది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారికి ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు.

తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని తయారు చేసింది. జనగణన ప్రక్రియ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్(Mritunjay Kumar Narayan) వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి నెలరోజుల్లో ఏపీలో గృహ గణన పూర్తి చేయాలని రిజిస్ట్రార్ జనరల్ వెల్లడించారు. గృహ గణన సమయంలో 33 అంశాలపై వివరాలు నమోదు చేశారు. రెండో దశలో జనగణన వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. రెండో దశలోనే కులగణనతో కలిపి జనగణన చేపట్టాలని మృత్యంజయ్ కుమార్ తెలిపారు. తొలిదశ గణన కోసం 19 భాషల్లో ప్రశ్నావళి రూపొందించామన్నారు.

జనగణన ప్రక్రియలో సిబ్బందికి దేశవ్యాప్తంగా శిక్షణ కొనసాగుతోందన్నారు. ఈ సారి జనగణన అంతా డిజిటల్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించామని వెల్లడించారు. పౌరులు మొబైల్ యాప్ లో స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. మొబైల్ టాప్ 16 భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. నమోదు చేసే సిబ్బంది తమ సొంత మొబైల్ వాడుకోవాల్సిఉంటుందని వివరించారు. ఆఫ్ లైన్ కూడా వివరాల నమోదు చేసేలా టాప్ రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. స్వయంగా వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని రిజిస్ట్రార్ జనరల్ వెల్లడించారు. మొబైల్ నెంబర్ ద్వారా ఐటీ వస్తుంది.. దాని ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. డేటా లీక్ అవ్వగుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.