వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం
29-07-2026 05:59 PM
ఉట్నూర్, (విజయక్రాంతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వందేళ్ల క్రితం నాటిన మామిడి చెట్టు పడిపోయింది. గుడిహత్నూర్ నుండి ఇంద్రవెల్లి ప్రధాన రహదారి పక్కన ఆర్ అండ్ బి శాఖలో గ్యాంగ్ మెన్ లు గా విధులు నిర్వహించిన వారు వందేళ్ల క్రితం మామిడి చెట్టును నాటారు. ఆ చెట్టు బుధవారం తెల్లవారుజామున వర్షానికి వీచిన గాలికి రోడ్డు పక్కన పడిపోయింది. ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఎస్సై సాయన్న పోకిరి సాయంతో రోడ్డుపై నుండి తొలగించారు. మామిడి చెట్టు గత వేసవి వరకు కాయలను ప్రజలకు అందిస్తూ ఉండేది. చెట్టు రోడ్డుపై పడిపోవడంతో ముత్తునూర్ ఏమైకుంట గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి ఏటా మామిడికాయలు అందించే చెట్టు పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.






