ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కూడా శుక్రవారం స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలి పనులకు తప్పనిసరి హాజరై దినసర కూలి పొందాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా చూడాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సూచించారు. ఎండ సమయము కాకముందు పనులకు హాజరై ఎండ తీవ్రత రాకముందు పనులు ముగించుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలుతో కలిసి పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, కార్యదర్శి అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.






