సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
ప్రతి పనిలోనూ పారదర్శకంగా అడుగులు
తాగునీటి శుద్ధి కేంద్రం ను ప్రారంభించిన ఎంపీడీకే అరుణ
కోయిల్ కొండ, మార్చి 20 : సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండలం బండమీద తండా గ్రామంలో త్రాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ అరబిందో ఫార్మా వారి సహకారంతో ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలని.. కనీస సౌకర్యాలు ఉంటే మౌలిక వసతులు కల్పించేలా కేంద్రం కృషి చేస్తుందన్నారు.
జీ రామ్ జీ పథకంతో పేదలకు 125 రోజుల ఉపాధి కల్పిస్తుందని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, పాఠశాల అదనపు తరగతులు, ప్రహరీ లాంటి పనులు ఆ పథకం ద్వారా కేంద్రం నిధులు అందిస్తుందన్నారు. ప్రతి గ్రామాల్లో మంచినీటి సరఫరా చేయాలని జల్ జీవన్ మిషన్ తీసుకువచ్చిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు,గర్భిణులకు పౌష్టికాహారం కేంద్రం అందిస్తుందని,పంట దిగుబడి పెరిగేందుకు రైతులకు అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయన్నారు.
వికాసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే.. అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలన్నారు.గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్న.. రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకునే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలకు అన్ని తెలుసు,గ్రామాల్లో చైతన్యం వచ్చిందన్నారు.తక్కువ వడ్డీకి రుణాలు, రైతులకు, మహిళా సంఘాలకు,వ్యాపారాలు చేసుకునేందుకు యువతకు రుణాలు కేంద్రం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.




