నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
21-03-2026 12:00 AM
నాగర్ కర్నూల్ మార్చి 20 ( విజయక్రాంతి): ఎస్‌ఎస్సి ( పది )పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధించబడినట్టు తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.




