8 August, 2026 | 3:06 PM

వర్నిలో ఘనంగా ఎంపీ సురేష్ శెట్కార్ జన్మదిన వేడుకలు

08-08-2026 01:53 PM

బాన్సువాడ, ఆగస్టు 8 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Shetkar) జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సుభాష్ చంద్ర బోస్ చౌరస్తా లో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఎంపీ షెట్కార్ ఆయురారోగ్యాలతో ఉండాలని మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెల్గేట్ కూనిపూర్ రాజిరెడ్డి, AMC చైర్మన్ సురేష్ బాబ,కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెలగపూడి గోపాల్, PACS అధ్యక్షులు నామాల సాయిబాబా,నేమని వీర్రాజు, అబ్దుల్ భారీ,కలాల్ గిరి,గంగా ప్రసాద్,మాచవరపు రవి, ఇళ్తేమ్ బాలు, జాకోరా సర్పంచ్ కేంద్రం సాయిలు,వర్ని సర్పంచ్ ఆనంద్,బుద్దె గంగాధర్, బుడ్డన్న,వర్నివెంకటి గౌడ్, నేమని రఘు, అవేజ్, సంజీవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.