8 August, 2026 | 4:20 PM

కాలభైరవ స్వామి ఆలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పూజలు

08-08-2026 02:43 PM

రామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి ) గ్రామాల్లో గల  కాలభైరవ స్వామి దేవస్థానాన్ని శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి. శ్రీపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. కార్యనిర్వహణ అధికారి బి. ప్రభు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇరు గ్రామాల సర్పంచులు, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాపురెడ్డి , గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.