నిర్మాణాలు పక్కగా ఉండేలా చూడండి
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
జడ్చర్ల : మున్సిపాలిటీలో కొనసాగుతున్న వర్షపు నీటి కాల్వ పనులు, జాతీయ రహదారి పనులు, కల్వర్టు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించి, సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను పనులను వేగవంతం చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, ముఖ్యంగా పనులు జరుగుతున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేదా సమస్యలు కలగకుండా ఉండేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాణ్యత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు ఉన్నారు.






