8 August, 2026 | 3:07 PM

రోడ్డుపై వర్షం నీటిని తొలగించాలని కౌన్సిలర్ నిరసన

08-08-2026 01:52 PM

కామారెడ్డిలో రోడ్డుపై నీలిచిన నీటి గుంత లో కూర్చుంది ఆవేదన 

కామారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నీలిచిన వర్షపు నీటిలో స్థానిక కౌన్సిలర్ కూర్చుంది నిరసన వ్యక్తం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని  కౌన్సిలర్ లక్ష్మీనారాయణ వర్షం నీటిలో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు  స్పందించి వర్షం పడినప్పుడు రోడ్డుపై నిలుస్తున్న నీరు నిలువ ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.

మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ చైర్ పర్సన్ కు  సమస్యపై వివరించిన పట్టించుకోవడం లేదని ఇప్పటినైనా అధికారులు స్పందించాలని అధికారులను లక్ష్మీనారాయణ కోరారు. కౌన్సిలర్ కరీంనగర్ కామారెడ్డి రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రతిసారీ వర్షాలు పడినప్పుడు నీటి నిలువ  ఉండడంతో వాహనదారులకు, ప్రయాణకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా పక్కనున్న డ్రైనేజీలను క్లీన్ చేయాలని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని లక్ష్మీనారాయణ కోరారు. వెంటనే మున్సిపల్ అధికారులు క్లీనర్ ట్యాంకర్ ను తెప్పించి నిల్వ ఉన్న నీటిని తొలగించారు. శాశ్వత సమస్య పరిష్కారం చేయాలని కౌన్సిలర్ లక్ష్మీనారాయణ కోరారు.