17 August, 2026 | 2:14 AM

నల్ల పోచమ్మ ఆలయంలో ఎంపీ ఈటల పూజలు

17-08-2026 01:01 AM

మేడ్చల్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): కీసర మండలం అంకిరెడ్డిపల్లి లో ని పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఎంపీని సన్మానించారు.

ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల్ రెడ్డి, కీసర అధ్యక్షుడు బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.