12 May, 2026 | 9:39 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నవ్వులు పంచే పర్వతాలు!

21-01-2026 12:32 AM

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లి చుట్టూ తిరిగే పూర్తి వినోదాత్మక చిత్రమిది. తెలంగాణ గ్రామీణ ప్రాంతా ల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.

నరేశ్ వీకే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన ‘పర్వతాలు’ అనే పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. సంప్రదాయ వస్త్రధారణలో నరేశ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; డీవోపీ: శ్యామ్ దూపాటి; సాహిత్యం: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: శ్రావణ్ కటికనేని; ఆర్ట్: సాయి కదిర; స్క్రీన్‌ప్లే: శ్రీనివాస రవీంద్ర; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: భద్రప్ప గాజుల.