28 August, 2026 | 6:31 AM

కాన్‌స్రో-హైబిజ్ టీవీ మధ్య ఎంవోయూ

28-08-2026 12:03 AM

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): ప్రముఖ నిర్మాణ రంగ ఎక్స్‌పో- కాన్‌స్ట్రో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ హైబిజ్ టీవీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కాన్‌స్ట్రోను మరింత విస్తృత ప్రేక్షకులకు చేర్చడంలో, తెలంగాణలో దాని ఉనికిని బలోపేతం చేయడంలో ఈ ఎంవోయూ ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందంలో భాగంగా, హైదరాబాద్లో జరగనున్న కాన్‌స్ట్రో 2.0 ను ప్రమోట్ చేయడంలో హైబిజ్ టీవీ, పీసీఈఆర్‌ఎఫతో కలిసి పనిచేస్తుంది.

నిర్మాణ సంస్థలు, నిపుణులు, ఎగ్జిబిటర్లు, పరిశ్రమ సంఘాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.కాన్స్ట్రో 2.0 - జూన్ 2027లో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఎక్స్పోలో తాజా నిర్మాణ సాంకేతికతలు, ఉత్పత్తులు, పరికరాలు, ఆవిష్కరణలు ప్రదర్శించబడతాయి. అదేవిధంగా పరిశ్రమ నెట్వర్కింగ్ మరియు జ్ఞాన మార్పిడికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఈ భాగస్వామ్యం భారత నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో ఆవిష్కరణ, పరిశ్రమ సహకారం, వృత్తిపరమైన అభివృద్ధికి పీసీఈఆర్‌ఎఫ్ 43 ఏళ్ల నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.