2 June, 2026 | 4:38 AM

పోంచర్లకు ట్రాఫిక్ పోటు!

02-06-2026 01:05 AM
  1. అయినా సిగ్నల్స్‌కు నోచుకోని నగరం
  2. ప్రధాన చౌరస్తాల్లోను వాహనదారులకు తప్పని తిప్పలు
  3. పెరుగుతున్న జనాభాతో ఎక్కువవుతున్న ట్రాఫిక్ సమస్య 
  4. మఠంపల్లి బ్రిడ్జి ఏర్పాటుతో రెండు రాష్ట్రాలకు సులువైన రాకపోకలు
  5. వాహనాల రద్దీతో సమస్య మరిత జఠిలం 

హుజూర్ నగర్, జూన్ 1: రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న పోంచర్ల (హుజూర్ నగర్) లో ప్రజలకు ‘ట్రాఫిక్‘ కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో వాహనాల రద్దీ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఇందిరా చౌక్ వద్ద వాహన చోదకులు ఇష్టారీతిగా వాహనాలు నడపడం వలన తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి పురపాలక, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిగ్నళ్లు ఏర్పాటు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

ఖమ్మం నుండి జడ్చర్ల వరకు నాలుగు లైన్ల రహదారి నేషనల్ హైవే-165 గా విస్తరించారు. దీని వలన కోదాడ నుండి మిర్యాలగూడ వరకు కొంత వరకు రద్దీ సమస్య పరిష్కారమైంది. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరాచౌక్ వద్దకు వచ్చి అటు మఠంపల్లి వైపు వెళ్ళే వాహనాలు, ఇటు కోదాడ వైపు వెళ్ళే వాహనాలు ఇక్కడే మళ్ళుతుండడంతో కొన్నిసార్లు ట్రాఫిక్ కు అంత రాయం కలుగుతుంది. అందుకే అక్కడ ట్రా ఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వేగంగా అభివృద్ధి: 

హుజూర్ నగర్ పట్టణం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడిన తరువాత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి  కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో హుజూర్ నగర్ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం పట్టణం వైపే మొగ్గు చూపుతున్నారు. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ, టీచర్స్ కాలనీ, వెంకటనగర్ కాలనీ, వాసవి భవన్, గ్రీన్ వుడ్ స్కూలు ఏరియాలలో సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజలు అత్యధికంగా మొగ్గు చూపు తున్నారు. దీంతో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్నాయి.                                             

పెరిగిన వాహనాల రద్దీ : పట్టణంలోని ఎస్బి ఐ, కోర్టు సముదాయాలు, తపాల కార్యాలయం, పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత బస్టాండ్, పొట్టి శ్రీరాములు సెంటర్, గాంధీ పార్క్ చౌరస్తాల వద్ద ఉదయం, సాయంత్రం సమయంలో వాహనాల రద్దీ అత్యధికంగా ఉంటోంది. పట్టణంలో ఆరు కూడళ్లున్నా యి. వాటిలో ప్రధానంగా మూడు కూడళ్ళు నిత్యం వాహనాల రద్ధితో ఉంటాయి. వాహనదారులు చౌరస్తాల వద్ద రహదారిని బంధనలు పాటించక పోవడంతో ప్రమాదాలు సైతం నిత్యం చోటు చేసుకుంటున్నాయి.

పోలీసులు ప్రధాన రహదారుల పక్కన వా హనాలు నిలుపుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు తప్పా రాంగ్ రూట్లో వెళ్లే వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ సిబ్బంది ఉదయం, సాయంత్రం సమయం లో పర్యవేక్షణ చేస్తున్నారు తప్పా మధ్యాహ్న సమయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లే కపోవడం వలన కొందరు యువకులు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు అధిక వేగంతో నడుపుతూ పక్కన వెళ్లే వారికి ఇ బ్బందులు కల్గిస్తున్నారు.

మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, అలాగే కోదాడ, ఖ మ్మం, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ల, గుంటూరు వెళ్లే వారు పట్టణం మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో పట్టణంలో రోజు 30 నుంచి 40 వే ల వాహనాలు తిరుగుతున్నాయని స్థానికు లు పేర్కొంటున్నారు.ఈ ఫలితంగా ఇందిరా చౌక్ వద్ద వాహనాల రద్దీ నియంత్రించడానికి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

ఉన్నతాధికారులకు నివేదిక పంపాం

పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. పట్టణంలోని ప్రధానంగా ఇందిరా చౌక్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి గతంలో స్థల పరిశీలన చేసి ఉన్నతా ధికారులకు నివేదిక అందజేశాం. ఉన్నతధికారుల నుండి అనుమతి లభించిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. చౌరస్తా వద్ద రహదారులు సరైన క్రమంలో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకా శం ఉంది. ఇప్పటికైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తూ పరిస్థి తులను చక్కదిద్ది ప్రయ త్నం చేస్తున్నాం. ప్రధాన కూడా ల వద్ద ఇబ్బందులు రా కుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.

గజ్జె చరమందరాజు, సీఐ, హుజూర్ నగర్