2 June, 2026 | 3:47 AM

అష్ట కష్టాలు.. సగం సగం పనులు..

02-06-2026 01:24 AM

కేసముద్రం, జూన్ 1 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు ఏది కూడా కోసెల్లాదీయ కుండా.. నెలలు తరబడిగా సగం.. సగం పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన స్వంత మండలమైన కేసముద్రం అభివృద్ధికి వంద ల కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.

ఇందులో ప్రధానంగా రహదారుల విస్తరణ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు, అలాగే కోరుకొండ పల్లి క్రాస్ రోడ్ నుండి అంబేద్క ర్ సెంటర్ వరకు, జూనియర్ కాలేజీ నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు రోడ్డు విస్తర ణ పనులు చేపట్టారు.

అలాగే బైపాస్ రోడ్డు ను నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించే పనులను చేపట్టారు. అయితే పనులు చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికీ, ఏ పనులు కూడా పూర్తి చేయకుండా సగం సగం పనులు చేస్తున్నారని, కొన్నిచోట్ల డివైడర్ పూర్తి చేస్తే, మరికొన్ని చోట్ల రోడ్డు పూర్తి చేశారని, ఇంకొంచొట్ల రోడ్లు అసంపూర్తిగా వదిలేసి, డివైడర్ల పనులు చేపట్టారని, మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలను తొలగించలేదని, రోడ్డు పనులు చేపట్టడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆరో పిస్తున్నారు.

ఏ ఒక్కచోట కూడా రోడ్డు, డివై డర్, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్తు లైన్ల విస్తరణ పూర్తి చేయలేదని, అన్ని పనులు సగం సగం చేస్తూ, మధ్యలో నిలిపివేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిం ది. బైపాస్ రోడ్డు నిర్మాణంలో బ్రిడ్జి నిర్మా ణం పూర్తి కాకముందే, మహబూబాబాద్ వెళ్లడానికి ప్రధాన రహదారిని విస్తరించే పనులు చేపట్టారు. దీనితో ఈ మార్గంలో తరచుగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

డివైడర్లు నిర్మిస్తున్నప్పటికీ రోడ్డు విస్తరించకుండా, మధ్యలో విద్యుత్ స్తంభాలను అలాగే ఉంచడం వల్ల రోడ్లు ఇరుకుగా మారి వాహనాలు నడవడానికి ఇబ్బందిగా మారింది. ప్రధానంగా జంక్షన్ ల వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టకుండానే డివైడర్లు నిర్మించడంతో భారీ వాహనాలు మలుపులు తిరిగే చోట రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద బైపాస్ రోడ్డు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండానే డివైడర్ నిర్మిస్తున్నారు.

ఈ మార్గం ద్వారా ప్రతిరోజు భారీ వాహనాలు, గ్రానైట్ లారీలు వెళ్లడానికి ఆటంకంగా మారింది. సోమవారం ఈ మార్గంలో ఓ లారీ రోడ్డు మధ్య డివైడర్ కోసం తవ్విన గోతిలో ఇరుక్కుపోయింది. ఫలితంగా రాకపోకలకు అం తరాయం కలిగింది. ఇలాగే ప్రతిరోజు చాలాసార్లు ట్రాఫిక్ స్తంభించిపోతుంది. పట్టణం లో అభివృద్ధి పేరిట రోడ్లన్నీ తవ్వి సగం స గం పనులతో వదిలేశారని, దీనితో అభివృద్ధి చేశారని సంతోషించాలో.. సగం సగం పనులతో ఇబ్బందులు పడాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మార్కెట్ రోడ్డులో కల్వర్టు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడం, రోడ్డు పూర్తిగా తవ్వి కొంతమేర కంకర వేసి, మిగిలిన రోడ్డు పనులు చేపట్టకపోవడంతో మార్కెట్ రోడ్డులో ప్రయాణం నరకయాతనగా మా రిందని వాపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కేసముద్రం మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే, పనులను సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకో వడంలేదని, నిర్లక్ష్యం వహించడం వల్ల చేసిన అభివృద్ధికి సార్ధకత చేకూరడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే లోలోపల కుమిలిపోతున్నారు.

రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ముందుగా రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించిన తర్వాత రోడ్లపై ఉన్న విద్యుత్ లైన్లను తొలగించి, పక్కకు జరిపి డ్రై నేజీ నిర్మించిన తర్వాత రోడ్లు నిర్మిస్తే బాగుండేదని, ఇప్పుడు ఇలా అర్థం పర్థం లేకుండా పనులు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి పనుల్లో వేగం పెంచి, ఒకవైపు ఇబ్బందులు లేకుండా రహదారి క్లియర్ చేసి, అనంతరం మరోవైపు పనులు పూర్తి చేయాలని, బైపాస్‌లో బ్రిడ్జి, జంక్షన్ల వద్ద విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.