27 June, 2026 | 2:08 AM

అమ్మ మాట.. అంగన్వాడీ బాట..

27-06-2026 12:00 AM

కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని 41 వ వార్డులో శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట, అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్ పాల్గొన్నారు. 3 సంవత్సరాల వయస్సు నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అంగన్వాడి స్కూల్ యూనిఫాం లను కౌన్సిలర్ రాజమణి పంపిణీ చేశారు. ఆనంతరం అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పాలు, గుడ్లు పౌష్టికాహారం పంపిణీ చేసి రికార్డ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరస్వతి, అయా, పిల్లల తల్లులు పాల్గొన్నారు.