26 August, 2026 | 7:35 PM

ఘనంగా మదర్ తెరిసా జన్మదిన వేడుకలు

26-08-2026 06:37 PM

ఎర్రుపాలెం(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురం  బాలాజీ భవన్  వృద్ధాశ్రమ నందు కిండిల్ రూరల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలాజీ భవన్ ఆశ్రమం లోని వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు వేమిరెడ్డి అనూష మాట్లాడుతూ మదర్ తెరిసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సేవా భావంతో సమాజంలోని  అభాగ్యులను ఆదరించాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఎంతో కొంత సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కనకవల్లి సత్యనారాయణ ,జయమ్మ బాలాజీ భవన్ కన్వీనర్ కర్నాటి శ్రీనివాసరెడ్డి, దుపుకుంట్ల వెంకటేశ్వరరావు, సముద్రాల మోహన్ రావు, గంగాధర్ రెడ్డి, వీరభద్రరావు అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.