వివాహ వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి
26-08-2026 07:14 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి కుమారుడు స్నేహిత్ రెడ్డి వివాహ వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు,మండల మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్, మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






