సాగునీటి కోసం మహా ధర్నాకు బైక్ ర్యాలీతో బయలుదేరిన బిఆర్ఎస్ శ్రేణులు
26-08-2026 07:17 PM
* సాగర్ జలాలు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణుల డిమాండ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): నాగార్జునసాగర్ జలాలను సాగు, తాగునీటి అవసరాలకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేరేడుచర్లలో బుధవారం నిర్వహించిన రైతు మహాధర్నాకు గరిడేపల్లి మండల బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో తరలివెళ్లారు. సాగునీరు అందక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.






