26 August, 2026 | 7:54 PM

ర్యాగట్లపల్లిలో కాంగ్రెస్‌కు షాక్‌

26-08-2026 07:07 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.

వారిలో ఏనుగు సంతోష్‌రెడ్డి, 8వ వార్డు సభ్యురాలు ఏనుగు సుజాత, నాగి ఎల్లయ్య, నాగి పెద్దమ్మ, తోలుకుల లస్మయ్య, సింగిరెడ్డి చిన్న భూపతిరెడ్డి, బుడ్డని లక్ష్మి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకిటి భాగ్యమ్మ నీలం రెడ్డి, ఉపసర్పంచ్ తొట్ల సాయన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తేల్లి శ్రీనివాస్, సాయిలు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.