నేరేడుచర్ల మున్సిపాలిటీలో దోమలను నివారించాలి
ప్రగతిశీల మహిళా సంఘం వినతి.
నేరేడుచర్ల,ఆగస్టు 07(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో దోమలు నిర్ములనకు చర్యలు తీసుకోవాలని ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన. నాగరాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురుగు కాల్వలలో చెట్లు పెరిగి ,నీరు నిల్వ ఉండి దోమలు అధికంగా ఉన్నాయని,వాటి వల్ల ప్రజలకు మలేరియా టైఫాయిడ్ మరియు సీజనల్ వ్యాధులు ప్రబలి ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. కావున మునిసిపల్ కమిషనర్ వెంటనే స్పందించి 15 వార్డులలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు మరియు డివిజన్ కార్యదర్శి చందన బోయిన లక్ష్మి, హుజూర్నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు సయ్యద్ రేష్మ,శ్యామల, మండల అధ్యక్షురాలు మరియమ్మ, టౌన్ అధ్యక్షురాలు మల్లేశ్వరి మరియు చెన్నమ్మ, నీలమ్మ, సుజాత, జానీ బేగం తదితరులు పాల్గొన్నారు.






