రోడ్డుప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
07-08-2026 01:13 PM
బెజ్జూర్ ఆగస్టు 7,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి వంతెన(Krishna Palli Bridge) సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇందిరిగాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ప్రయాణికులు బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదం కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






