7 August, 2026 | 2:17 PM

ఆదిత్య పాఠశాల అనుమతులపై ఎంఈఓ స్పష్టీకరణ

07-08-2026 01:16 PM

నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి...

బాన్సువాడ, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలలకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని మండల విద్యాధికారి నాగేశ్వర్‌రావు శుక్రవారం స్పష్టం చేశారు. ఇటీవల పాఠశాల అనుమతులకు సంబంధించి వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆదిత్య పాఠశాల అనుమతి పత్రాలను పరిశీలించగా అవి చెల్లుబాటులో ఉన్నాయని తెలిపారు. పాఠశాల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ నిబంధనల ప్రకారమే అనుమతులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.అయితే పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగుతాయని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే ఎలాంటి విద్య సంస్థల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.విద్యార్థుల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యాశాఖను సంప్రదించాలని ఆయన సూచించారు.