7 August, 2026 | 1:18 PM

నాకంటే మొనగాడేం కాదు మీ ఎస్పీ..!

07-08-2026 12:13 PM
  1. - పదేళ్లు ఎమ్మెల్యేగా, విప్పు గా ఉన్నా నా ఫోనే ఎత్తాడా..?
  2. - నా వెనకాల లక్షలమంది ప్రజాబలం ఉంది నా సత్తా ఏంటో చూపిస్తా..
  3. -  మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
  4. - పండుగ సాయన్న విగ్రహ తొలగింపు వివాదంలో ముందస్తు అరెస్ట్. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మీ ఎస్పీ నాకంటే మొనగాడేం కాదు.. పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా పని చేశా నా ఫోనే ఎత్తడా అంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే(Former MLA of Achampet) గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపు అంశంపై కొనసాగుతున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న విషయాన్ని పోలీసులు ముందస్తుగా గుర్తించి కొట్ర గేట్ సమీపంలో తన వాహనాన్ని అడ్డుకున్నారు.  అనంతరం ఊర్కొండపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు(Former MLA Guvvala Balaraju) మధ్య వాగ్వివాదం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సహకరించాలని స్థానిక పోలీసులు బుజ్జగించారు. అయినా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫోన్ చేసినా ఈ ఎస్పీ స్పందించడం లేదన్నారు. పోలీసు బలగం వందల్లో ఉంటే తనకు లక్షల మంది ప్రజాబలం ఉందని తన సత్తా ఏమిటో చూపిస్తేనే పోలీసులకు తెలిసి వస్తుందంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.