28 June, 2026 | 1:59 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

లోకమంతటికి ఆరోగ్య ప్రదాత హనుమంతుడే

16-04-2026 01:56 PM

వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ

ఖానాపూర్ (విజయక్రాంతి): అతిభలవంతుడు, లోకమంతటికి ఆరోగ్యప్రదాత హనుమంతుడే అని వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ కొమురం భీం చౌరస్తాలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రతినెల నిర్వహిస్తున్న మాసోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆలయంలో పూర్వభద్ర నక్షత్రం మహోత్సవ కార్యక్రమంలో గణపతి పూజా పంచామృత అభిషేకం అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం హారతి కార్యక్రమాలను ఆలయ అర్చకులు తిరునగరి నందకిషోర్ నిర్వహించారు.

వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి .ఈ కార్యక్రమాలు చేయడం వల్ల భక్త జనాల్లో దారిద్రత తొలిగిపోయి సకల కోరికలు నెరవేరుతాయని పండితులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు తోట హనుమం తు, కార్యదర్శి తుమ్మలపల్లి లక్ష్మణ్,, కోశాధికారి ఎడ్ల రాజేశ్వర్, సభ్యులు ప్రవీణ్ ,రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు బండి పల్లి సింధుజ, బొప్పాలపు సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.