నిర్మల్ మున్సిపాలిటీలో కోతుల పట్టివేత
21-04-2026 01:56 AM
నిర్మల్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ప్రజలను ప్రజలను బెంబేలెత్తిస్తున్న కోతుల పట్టివేత కార్యక్రమం సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
నిర్మల్ పట్టణంలోని పలు వార్డులను కోతులు పట్టే సిబ్బందిని రప్పించి కోతులను బంధించి సుధీర ప్రాంతాల్లో విడిచిపెట్టనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి తెలిపారు. మొదటిరోజు 100 కోతులను పట్టుకోవడం జరిగిందని వివరించారు. ప్రజలకు కూడా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు ఉన్నారు.






