15 March, 2026 | 3:28 AM

సమస్యలపై రాజీపడే ప్రసక్తే లేదు

15-03-2026 01:54 AM

ఆర్కే పురంలో సిల్ట్, నిర్మాణ వ్యర్థాల తొలగింపుపై నిఘా

ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యా లను సాధించేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయిలో శనివారం ఉదయం ఆయన టెలిఫోన్ కాలనీ, ఆర్కే పురం రోడ్ నం.1 ,చిత్రా లేఅవుట్ ప్రాంతాల్లో విస్తృతం గా పర్యటించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని సహించేది లేదని, ప్రజలకు మెరుగైన సేవలందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.పర్యటనలో భాగంగా కమిషనర్ రోడ్డు మార్జిన్లను పరిశీలించారు. ముఖ్యంగా హిల్స్ , వాటర్ బోర్డ్ పనుల వల్ల పేరుకుపోయిన సిల్ట్ ను, భవన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. చిత్రా లేఅవుట్ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఎల్బీ నగర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్‌ను కలిశారు.

కాలనీలో పందుల బెడద విపరీతంగా ఉందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కమిషనర్.. సంబంధిత అధికారులతో మాట్లాడి పందుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు స్థానిక నివాసితులు సొంత ఖర్చు తో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

స్థానిక చిత్రా లేఅవుట్ లో దేవాలయ నిర్మాణం కోసం 1000 గజాల భూమిని కేటాయించాలన్న విన్నపంపై కమిషనర్ సానుకూలంగా స్పందిం చారు. అదే ప్రాంతంలో నూతనంగా ఏర్పా టు చేసిన ఈ-వెస్ట్ కలెక్షన్ సెంటర్‌ను కమిషనర్ సందర్శించారు. అనంతరం పార్కులో నడకకు వచ్చే పౌరులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. నగర అభివృద్ధిలో పౌరులు కూడా భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతలో బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.