13 June, 2026 | 1:56 AM

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా రికార్డు మోదీ సొంతం

13-06-2026 12:49 AM

అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నే

భారత్ ను విశ్వ గురువుగా నిలబట్టడమే మోదీ సంకల్పం

మోదీ నాయకత్వంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కి వచ్చింది 

తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తుంది

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): నరేంద్ర మోదీ  ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో  కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి   విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోదీ   సొంతం అని అన్నారు, దేశంలో  అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నే అని అన్నారు. 

భారత్ ను విశ్వ గురువుగా నిలబట్టడమే ఆయన సంకల్పం అని అందుకు ఆయన అహర్నిశలు పాటు పడుతున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. అదే విధంగా తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తుందనీ అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కుంట లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.