13 June, 2026 | 1:55 AM

జీవన నైపుణ్యాలను పెంపొందించాలి

13-06-2026 12:49 AM

లయన్ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): యువ భారతంలోని అతి ముఖ్యమైన విభాగమైన కౌమార యువతలో సరైన ఆధునిక జీవ న నైపుణ్యాలు పెంపొందిస్తేనే రేపటి భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభిస్తుందని లయన్ జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరామ్ అన్నారు. శుక్రవారం స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల(సీబీఎస్‌ఈ) ప్రాంగణంలో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల లయ న్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. కౌమర దశలో ఉన్న యువత శరీరంలో వచ్చే హార్మోనల్ మార్పులకు అనుగుణంగా వారి మానసిక స్థాయిని సరైన పద్ధతిలో మార్గదర్శనం చేయడానికి లయన్స్‌క్వెస్ట్ శిక్షణ ఉప యోగపడుతుందన్నారు.

వారు వ్యక్తిగత శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యత సాధిం చేందుకు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్వెస్ట్ శిక్షణను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశిష్ట అతిథి లయన్ భద్రేశం మాట్లాడుతూ మార్కు లు, ర్యాంకుల చుట్టు తిరుగుతున్న నేటి విద్యావిధానంలో పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి జరగడం లేదన్నారు. మన పునాదులను నేటి టీన్స్‌కు పరిచయం చేయాల్సిన అవసరముందన్నారు.

సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల (సీబీఎస్‌ఈ) చైర్మన్ లయన్ డాక్టర్ పి.ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు తయారు చేసిన అంశాలతో కూడిన శిక్షణ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. చైర్మన్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థి చుట్టు సహచరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌర సమాజం వలయం ఏర్పడిందని, దీని ప్రాముఖ్యతను పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సభాధ్యక్షత వహించిన లయన్ పి.ప్రవీణ్ మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్న లయన్స్ క్వెస్ట్ టీచర్ల శిక్షణకు ఈ పాఠశాల అర్హత సాధించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూ దన్ రెడ్డితోపాటు శాతవాహన లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎం.మహెందర్, జీఎల్టీ కోఆర్డినేటర్ ఈ.రమేష్, రీజియన్ చైర్మన్ లయన్ వి.జగదీశ్వర చారి, కార్యదర్శి లయన్ జి.చంద్ర శేఖర్, కోశాధికారి లయన్ పి.సురేందర్, లయన్ ఎన్.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు -రోజుల శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రేనర్ కె.రేణుక, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, విజన్ స్కూల్ ఉపాధ్యాయులు ఐదుగురు, సెయింట్ జార్జ్ పాఠశాలకు చెందిన 24 టీచర్స్, ఐదుగురు ప్యారడైజ్ శిక్షణలో పాల్గొన్నారు.