విపత్తు, రక్షణ వ్యవస్థ ఆధునీకీకరణ
- ప్రమాదాల్లో ‘గోల్డెన్ అవర్’కీలకం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు, రక్షణ వ్యవ స్థను ఆధునికీకరణ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్ర భుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదాల్లో ‘గోల్డెన్ అవర్’కీలకమని, ఆ యా విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా విపత్తు నిర్వహణ మాక్ ఎక్స ర్‌సైజ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణపై సమీక్షించా రు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట ఎంతో కీలకమైనదని, దానిని ‘గోల్డెన్ అవర్’గా పరిగణించాలని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు, వరదల సమయంలో అన్ని వ్యవస్థలు సకాలంలో స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, అత్యవసర తర లిం పు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించాయి.
అనంతరం మం త్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్‌ను సందర్శించి అక్కడి రెస్క్యూ కార్యకలా పాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్ర మంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, తెలంగాణ రాష్ట్ర విపత్తు ఉన్నతాధికారి స్పందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్, పోలీస్, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ , రెవెన్యూ, వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పరిశ్రమలు, రవాణా, పశుసంవర్ధక, వెటర్నరీ శాఖ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






