27 July, 2026 | 1:33 AM

బోనమెత్తిన మాజీ మంత్రి పువ్వాడ

27-07-2026 12:30 AM

ఖమ్మంలో వైభవంగా బోనాల మహోత్సవం

ఖమ్మం, జులై 26 (విజయక్రాంతి): వర్షాలు సమృద్ధిగా కురవాలని అందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 48వ డివిజన్లో ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఖమ్మం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులకు మంచి పంటలు పండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.