సెక్యూరిటీ గార్డులకు అధునాతన సెక్యూరిటీ చెక్‌పోస్ట్ క్యాబిన్లు
శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా ఏడు క్యాబిన్ల ఏర్పాటు
నస్పూర్, ఆగస్టు 19 : సింగరేణి వ్యాప్తంగా సంస్థ ఆస్తుల పరిరక్షణ, పకడ్భందీ బొగ్గు రవాణాలో కీలక పాత్ర పో శిస్తున్న ఎస్ అండ్ పీసీ విభాగం సెక్యూరిటీ గార్డుల సౌకర్యార్థం అధునాతన సెక్యురిటీ చెక్ పోస్ట్ క్యాబిన్లను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. సెక్యురిటీ గార్డు గదులలో అసౌకర్యాలపై పలుమార్లు యూ నియన్లు , సెక్యురిటీ విభాగాల నుంచి వచ్చిన వినతులకు స్పందించిన యాజమాన్యం అన్ని ఏరియాల్లోని వే బ్రిడ్జిలు, ఇతర లోడిం గ్ పాయింట్ల వద్ద నూతన సెక్యురిటీ క్యాబిన్లను మంజూరు చేసింది.
ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాకు సైతం నూతన క్యాబిన్లు మంజూరు చేసింది.
శ్రీరాంపూర్ ఏరియాకు ఏడు సెక్యూరిటీ క్యాబిన్లు...
సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాకు ఏడు అధునాతన సెక్యూరిటీ గార్డు క్యాబీన్లను మంజూరు చేసింది. ఎస్‌ఆర్పీ 1 గనిలో రెండు క్యాబిన్లు, ఆర్కే 7 వే బ్రిడ్జి వద్ద ఒకటి, శ్రీరాంపూర్ ఓసీలో రెండు, ఎస్‌ఆర్పీ సీహెచ్పీలో ఒకటి, చెన్నూర్ సాండ్ బంకర్ వద్ద ఒకటి చొప్పున మంజూరు కాగా ఇందులో ఇప్పటికే ఆరు క్యాబిన్లను సిద్ధం చేశారు. చెన్నూర్ సాండ్ బంకర్ వద్ద సెక్యురిటీ క్యాబి న్ ఇంకా నిర్మాణంలో ఉంది.
చెక్ పోస్టులను ప్రారంభించిన జీఎం
శ్రీరాంపూర్ లోని ఎస్‌ఆర్పీ 1 వేబ్రిడ్జి పరిసరాలలో ఏర్పాటు చేసిన రెండు అధు నాతన ఎస్ అండ్ పీసీ చెక్ పోస్ట్ క్యాబీన్లను బుధ వారం శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తుందని, ఉద్యోగుల సౌకర్యా ర్ధం గనుల పరిసరాలలో రెస్ట్ హాల్స్ సైతం నిర్మిస్తుందన్నారు.
కంపెనీ కల్పించిన ఈ సదుపా యాన్ని సద్వినియోగపరుచుకొని సెక్యురిటీ సిబ్బంది సంస్థ ఆస్తుల పరిరక్షణ కు మరింత నిబద్దతతో కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా సెక్యురిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, ఎస్‌ఓటూ జీఎం కృష్ణ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, ఏరియా ఇంజనీర్ సురేష్, ఎస్‌ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవి కుమార్, ఆర్కే 7 గ్రూప్ ఇంజనీర్ మురళి,
గుర్తింపు సం ఘం ప్రతినిధులు ముస్కె సమ్మయ్య, మోతుకూరి కొమురయ్య, నర్సింగరావు, ఏరియా సెక్యురిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, ఎస్ అండ్ పీసీ పిట్ సెక్రటరీ మల్లికార్జున్, సిబ్బంది, ప్రైవేట్ సెక్యురిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






