20 August, 2026 | 2:43 AM

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు

20-08-2026 12:53 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 19 (విజయ క్రాంతి):నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మానుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, గత ప్రభుత్వ అప్పులను తీర్చుకుం టూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాద న్నారు. ఆసిఫాబాద్ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ ద్వారా రూ.10 కోట్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారని తెలిపారు. ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిం చారు. అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులు కాకుండా ప్రజలే తగిన సమాధానంచెబుతారనిహెచ్చరించారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తుందంటూ బీఆర్‌ఎస్ చే స్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. గత ప్ర భుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని, ఈ పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావు, డీసీసీ ఉపాధ్యక్షులు తరిఖ్, భీమ్రావు, ఆర్జీఎస్ జి ల్లా కోఆర్డినేటర్ కోవా ఇందిరా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, కౌన్సిలర్ జా డి వినోద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషన్గౌడ్, సుజాయిత్ఖాన్, మెంగాజీ, ఉప సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు చిట్ల నారాయణ, మ హిళా నాయకురాళ్లు విజయ, విమల, యూ త్ కాంగ్రెస్ నాయకులు ఎలగల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.