ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్యసేవలు అందించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
వనపర్తి టౌన్ జూలై 7: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సేవలు అందిం చాలంటే ఖాళీగా ఉన్న వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సింగ్, సాంకేతిక సిబ్బంది పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ బృందంతో కలిసి వనపర్తి జ నరల్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
అనంతరం ఆర్‌ఎంఓ ప్రసాద్తో ఆస్పత్రి పరిస్థితులపై చర్చించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యా ప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ రెండు నెలలపాటు ప్రత్యేక పరిశీలన చేపట్టిందని తెలిపారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు, జనరల్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
వనపర్తి జనరల్ ఆస్పత్రిలో 330 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ అనస్థీషియా, పిల్లల వైద్యం, నేత్ర వైద్యం తదితర విభాగాల్లో రెగ్యులర్ వైద్యులు లేరని, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, రేడియాలజీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఆస్పత్రిలో ఖాళీలను వెంటనే భర్తీ చేసి ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా నాయకులు ఎండీ జబ్బార్, బీసన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.






