8 July, 2026 | 2:43 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు

08-07-2026 01:54 AM

చౌటుప్పల్, జూలై 7 :మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలం బిఆర్ ఎస్ , బిజెపి , సిపిఐ పార్టీల వివిధ గ్రామాల సర్పంచులు గ్రామాల అభివృద్ధి కొరకై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు నివాసం వద్ద సర్పంచులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికై పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. వివిధ గ్రామాల సమస్యలపై మాట్లాడుతూ సూచనలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, దండు మల్కాపురం సర్పంచ్ గిరికంటి నిరంజన్ గౌడ్ , అల్లాపురం సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి, కంకణాల గూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్ ,  అల్లం దేవి చెరువు సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ వివిధ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.