25 July, 2026 | 11:26 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చు..ఎక్కువ దిగుబడి..

18-03-2026 12:00 AM

కేసముద్రం, మార్చి 17 (విజయక్రాంతి): ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు, సేంద్రియ సాగు పద్ధతి అవలంబిస్తున్న రైతులు పేర్కొన్నారు. కేసముద్రం మండలం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ద్వారా డ్రోన్ల వినియోగంపై శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇచ్చారు.

కల్వల క్లస్టర్ రైతులకు  ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రకృతి వ్యవసాయ రిసోర్స్ పర్సన్ సోల్లెటి జయపాల్ రెడ్డి  హాజరై రైతులకు సేంద్రియ వ్యవసాయం, పచ్చిరొట్ట  ఎరువులు, జీలుగ, జనుము వాడకం, జీవామృతం తయారీ , భూసార పరీక్షలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఏవో వెంకన్న మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల భూములు చౌడుగా మారి పంట దిగుబడులు బాగా తగ్గిపోయి రైతులకు  నష్టం వచ్చే అవకాశం ఉందని, భూ కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం  ఏర్పడి, మానవుల ఆరోగ్యం పై దుస్పరాభావం పడుతుందన్నారు.

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న, రైతులకు కిట్లు, క్యాలెండర్ సరఫరా చేసారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, లావణ్య, రవి వర్మ, కృషి సఖీలు అశ్విని, అరుణ, రైతులు పాల్గొన్నారు.