8 July, 2026 | 6:25 PM

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి

08-07-2026 05:19 PM

కొండపాక: నర్మెట్ట ఆయిల్ ఫామ్ కర్మాగారా ప్రారంభోత్సవానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా కొండపాక మండల కేంద్రానికి యంగ్ ఇండియా పాఠశాలను 200 కోట్లతో మంజూరు చేశారు. అనంతరం కొండపాక తహసిల్దార్ పాఠశాలకు కావలసిన స్థల సేకరణ పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారికి అందించడం జరిగింది. కానీ ఇప్పుడు కొండపాక మండల కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా పాఠశాల జగదేవ్ పుర్ మండలం పీర్లపల్లి గ్రామానికి తరలిస్తున్నారు.

తెలిసి కొండపాక మండల లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారికి వినతి పత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో  కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల కనక రాములు, ఏఎంసి వైస్ చైర్మన్ బట్ట పరశురాములు, కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసరి లింగారావు, పిఎసిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు, ఇతర గ్రామాల సర్పంచులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.