30 May, 2026 | 2:13 AM

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఎమ్మెల్యే యెన్నం

30-05-2026 12:00 AM

మహబూబ్ నగర్ మే 29 (విజయ క్రాంతి) : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి అధికారులు నోటీసులు జారీ చేశారు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై మొదటగా డిజిపికి ఫిర్యాదు చేసిన వారిలో  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ముందున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా కేసు వేగం పుంజుకుంది. ప్రస్తుతం విచారణ వేగవంతం కాగా జూన్  1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.