31 August, 2026 | 11:24 AM

జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్

31-08-2026 10:08 AM

ఇండ్ల స్థలాలు, సంక్షేమం కోసం పోరాటం

అక్టోబర్ లో పోరాట కార్యాచరణ

సెప్టెంబర్ లో సభలు, సమావేశాలు

ఐజెయు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్

(ఖమ్మం, విజయక్రాంతి): జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జర్నలిస్టులను సమీకరించి పోరుబాట పడతామని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ హెచ్చరించారు. జర్నలిస్టులు ఎప్పుడు అడిగిన ప్రభుత్వం కాదనడం లేదని కానీ పని కూడా పూర్తి చేయడం లేదని ఖమ్మంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం ఉండి అర్హులైన జర్నలిస్టుల జాబితా అధికారుల వద్ద ఉన్నా కూడా -నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) నగర కమిటీ సమావేశం ఆదివారం -స్థానిక మాంగళ్య ఫంక్షన్ హాల్లో జరిగింది.

నగర అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేణుగోపాల్ -మాట్లాడుతూ సుదీర్ఘ పోరాట చరిత్ర ఐజెయు సొంత మని పూర్వపు ఆంధ్రప్రదేశ్లో లో కానీ ఇప్పటి తెలంగాణలో కానీ జర్నలిస్టులకు -అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకం ఐజెయు పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఎన్నికల సందర్భంగా హామీ -ఇచ్చారని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డుల ద్వారా జర్నలిస్టులకు వైద్యం అందే ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రస్తుత ప్రభుత్వం -నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది జర్నలిస్టులు అనారోగ్య కారణాలతో చనిపోయారని ఇప్పటికైనా -అనారోగ్యం బారీన పడిన జర్నలిస్టులను ఆదుకునేందుకు హెల్త్ కార్డులను తక్షణం జర్నలిస్టులకు అందించాలన్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ స్కీంను అమలు చేస్తున్నారని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఐజెయు డిమాండ్ చేస్తుందన్నారు. ఖమ్మం జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య రెండు దశాబ్దాలుగా పెండింగ్లో లో ఉందని ఐజెయు పోరాట -ఫలితంగా 23 ఎకరాల స్థలాన్ని సొసైటీకి ఇస్తూ గత క్యాబినెట్ తీర్మానం చేసిందని దానిని జర్నలిస్టులకు అందించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. ఐజెయు మంత్రుల హామీ మేరకు కొంత సమయం ఇచ్చామని మరింత తాత్సరం చేస్తే పోరాట బాట పడతామన్నారు.

సెప్టెంబర్ మాసంలో అన్ని నియోజక వర్గాల సమావేశాలను పూర్తి చేసుకుని అక్టోబర్ లో ప్రభుత్వ తీరును బట్టి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వేణుగోపాల్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇండ్ల స్థలాల సాధన పూర్తి భద్రత లక్ష్యంగా ఐజెయు పని చేస్తుందన్నారు. ఈ -సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, సామినేని మురారి, హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి -మహేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నామా పురుషోత్తం, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, నగర కోశాధికారి ఏలూరి వేణుగోపాల్, నాయకులు మాధవరావు, వివిధ పత్రికల బ్యూరోలు ఎస్ కె మోహీనుద్దీన్, సత్యనారాయణ, నగర కమిటీ -సభ్యులు, వివిధ చానెళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు