స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి రంగులు వేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు
మేడ్చల్ అర్బన్, జూ లై 17 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని సో మవారం పట్టణంలో గల స్వర్గీయ మాజి ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు విగ్రహాన్ని కాం గ్రెస్ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా శుభ్రపరిచి రంగులు వేసినట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నాయకులైనప్పటికీ పార్టీలకతీతంగా పెద్దమనిషిని గౌరవంగా బావించి ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ రావు.నరసింహా యాదవ్.హానుమాండ్ల సురేష్.బందేల ముత్యాలు.రమేష్. సిహెచ్ శ్రీనివాస్ యాదవ్. నురుగనీ బిక్షపతి యాదవ్.లోకేష్ తదితరులు పాల్గొన్నారు.






