22 May, 2026 | 9:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.. అండగా ఉంటాం

08-12-2025 06:03 PM

గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్..

పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, అన్నిటికి అండగా ఉంటామని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కోరారు. సోమవారం మండల పరిధిలోని గాంధారిపల్లి, జయపురం, అబ్లాపూర్, అన్నారం, ఆరెపల్లి, కుర్తివాడ, దౌలపూర్, పాత లింగాయిపల్లి, కొత్త లింగాయిపల్లి, కొంపల్లి, తమ్మాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆయన వెంట మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు ఉన్నారు.