13 August, 2026 | 9:38 PM

సంఘ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

13-08-2026 08:46 PM

భైంసా(విజయక్రాంతి): బైంసా మండలంలో కామొల్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఐకెపి వివో సంఘా భవనాలను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. 12 లక్షలతో ఈ భవనాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పాటిల్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.