ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటా
20-04-2026 12:00 AM
రూ. 5 లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే
జడ్చర్ల, ఏప్రిల్ 19 : ఇటీవల మరణించిన జడ్చర్ల మండలంలోని కురువపల్లి పలుగుతాండకి చెందిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుటుంబాన్ని ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరామర్శిoచారు. విద్యార్థి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించి, తన వంతు సాయం గా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించిన సందర్భంగా పలువురు ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.






