25 May, 2026 | 10:48 PM

బీరప్ప ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

25-05-2026 09:38 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన  శ్రీ బీరప్ప స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.