25 May, 2026 | 10:48 PM

ప్రజావాణికి గైర్హాజరైన ఆరుగురికి షోకాజ్ నోటీసులు

25-05-2026 09:52 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన ఆరుగురు జిల్లా స్థాయి అధికారులకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. అధికారుల పట్ల నమ్మకంతో ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారని దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించాలని పదేపదే చెప్తున్నప్పటికీ ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.