గంగాపురిలో కేబుల్ ఆపరేటర్ పై కొతుల దాడులు
కోతుల బెడద నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి గ్రామంలో సోమవారం కేబుల్ ఆపరేటర్ పై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కేబుల్ ఆపరేటర్ బుర్ర మల్లికార్జున గౌడ్ కేబుల్ కనెక్షన్ డబ్బుల వసూళ్ల కోసం వస్తుండగా అదే సమయంలో కోతులు ఒక్కసారి మూకుమ్మడి దాడి చేయడంతో లబోదిబోమంటూ అరవడంతో ఇంటి పక్కన ఉన్న ఏగోలపు సంతోష్ గౌడ్ కర్ర తీసుకొని రావడంతో ప్రాణాలు దక్కాయి. ఆ దాడిలో తన తొడ బాగాన కాళ్లతో గిరి గాయపరిచాయి.
ప్రజలు ప్రతినిత్యం ఎదుర్కొంటున్న కోతుల బెడదను శాశ్వతంగా నిర్మూలిస్తామని వాగ్దానం చేసిన మున్సిపల్ పాలకవర్గం తూతూ మంత్రంగా మొదట కొన్ని కోతు లను వదిలేసి చేతులు దులుపుకున్నారని ప్రజల నుండి విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. మునిసిపాలిటీ పాలకవర్గం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. పత్రికల్లో మునిసిపాలిటీ పాలకవర్గం వచ్చిన కొత్తలో బోన్లు ఏర్పాటు చేసి కోతు ల నివారణకు పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా రెండు మూడు వార్డులలో కోతుల బోన్లు పెట్టి కోతులను పట్టేశామని చెప్పుకున్నారు.
బోన్లలో బంధించిన కోతులను మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో వదిలేస్తున్నామని తెలిపారు. ఆ సందర్భంలో కోతులను పట్టడానికి ఉద్యోగుల నియమిస్తున్నామని నిరంతర ప్రక్రియగా వారు కోతులను పట్టి వదిలివేస్తుంటారని మున్సిపల్ పాలకవర్గం వారు ప్రకటించడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ కోతులు పట్టే పనిని గాలికి వదిలేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా మంథని మునిసిపాలిటీ గంగాపురి కూచ్ రాజ్ పల్లి లో పాలకవర్గం చొరవ తీసుకొని కోతులను పట్టి సుదూర అడవుల్లో వదిలేయాలని మంథని ప్రజలు కోరుచున్నారు.






